నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: సీఎం సహాయ నిధితో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని నర్సింల గూడెం సర్పంచ్ బల్గూరి విష్ణువర్ధన్ అన్నారు. ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతరవీందర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం నుండి మంజూరు అయిన నర్సింల గూడెం గ్రామానికి చెందిన గంట లక్ష్మమ్మ రూ. 17 వేలు, బెల్లంకొండ సత్తయ్య రూ.60 వేలు, బలుగూరి అంజయ్య రూ. 35 వేలు, కాటo జంగమ్మ రూ.56 వేల చెక్కులను లబ్ధిదారుల బుదవారం అయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం సబండ వర్గాల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కి ప్రజలందరూ అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఅర్ స్ గ్రామ శాఖ అధ్యక్షులు కాటo శంకర్ , జాల వెంకటయ్య, ఉప సర్పంచ్ బెల్లంకొండ అండాలునరసింహ, వార్డ్ మెంబర్స్ కాటం వీరస్వామి, కొమ్మనబోయిన యాదయ్య, బిసు వల్లయ్య, జింకల వెంకటయ్య, కొమ్మనబోయిన లోకేష్ తదితరులు పాల్గొన్నారు.