బోడుప్పల్ అన్నపూర్ణ కాలనీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 15: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నపూర్ణ కాలనీ అధ్యక్షులు ప్రభాకర్ ఆధ్వర్యంలో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ అన్నపూర్ణ కాలనీలో కమ్యూనిటీ హాల్ అభివృద్ధి కి 20 లక్షలు కేటాయించారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కరించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్లు అభివృద్ధి పరుస్తారని హామీ ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్లు ధనగాల అనిత యాదిగిరి, వెంకటేష్ గుప్తా, పద్మ రాములు, అన్నపూర్ణ కాలనీ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top