మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు16: ఘట్కేసర్ మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 5 వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొని మాజీ ప్రధాని కి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజపేయి చరిత్ర ప్రపంచంలో లిఖించదగ్గె విషమని ఆయన జీవితం చాలా మందికి ఆదర్శం ఒంటరిగా జీవిస్తూ ఆయన దేశానికి చేసిన సేవలు మర్చిపోలేనివని.రాష్ట్రాలు, గ్రామాలు అభివృద్ధి హైవేలు నిర్మించడం వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడేనని ఆయన ఎప్పుడూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేదని రెండుసార్లు పదవి వచ్చిన మాటకోసం ఒక్క ఓటు కోసం పదవి వదులుకున్న వ్యక్తి అని అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యనా లేకపోవడం దురదృష్టమని ఆయన ఆశ సాధన కోసం మేమంతా పనిచేస్తామని భరతమాత ముద్దుబిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది వాజపేయి.పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలని కుల మతాలు విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పనులు మర్చిపోలేనివని ముందు తరాలకు ఆదర్శమని ఆయనను మన అందరి గుండెల్లో పెట్టుకొని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాస్, బిజెపి మండల అధ్యక్షుడు ప్రవీణ్ రావ్, ప్రధాన కార్యదర్శి ప్రభంజన్ గౌడ్, సినీ సర్టిఫికేషన్ నెంబర్ మైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రామోజీ, శ్రీరాములు, నాయకులు మచ్చిందర్ రెడ్డి,బసవరాజ్ గౌడ్, వీరారెడ్డి, శివ నాయక్, నరేష్, శ్రీకాంత్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.