బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని…
నకిరేకల్, ప్రజానేత్రం, ఆగష్టు 27: కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించకుంటే మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని బిఎస్పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, సిసి రోడ్లు వేపిస్తామని మమ్మల్ని పాటించుకోవడం లేదని 4వ వార్డ్ రైల్వే స్టేషన్ రోడ్డు జమ్మి నగర్ కాలనీ వాసులు బిఎస్పి నాయకులకు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి బిఎస్పి కార్యక్రమాన్ని ఆమే ప్రారంభించింది. కాలనీని పరిశీలించి మాట్లాడారు మురుగు నీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ డ్రైనేజీ కాలువలు లేక మురుగునీరు ప్రవహించే మార్గం లేక డ్రైనేజీ కాలువ నుంచి వెదజల్లే దుర్గంధం కారణంగా ఎప్పడు ఎలాంటి రోగాల బారిన పడాల్సివస్తుందోనని కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. కాలనీలో నివసించే ప్రజలు ఇళ్లముందు కాలువల్లో మురుగు నీరు ఉన్నప్పటికీ తమ తలరాతలు ఇంతేనని గడుపుతూ వస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతుండటంతో అనేక మందికి రోగాల భారిన పడుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండటంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధుల బారిన పడతానేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. మురుగు నీరు నిండి దోమల వ్యాప్తికి వృద్ధి చెందుతుంది. ఈ అస్తవ్యస్త డ్రైనేజీ కారణంగా స్థానికులు ప్రతి రోజూ మురుగు నీటి మధ్య సహజీవనం సాగిస్తున్నారు. దీంతో రోగాలకు గురవుతున్న పరిస్థితులు దాపరిస్తున్నాయి. నాయకులు, అధికారులు మాత్రం ఇలాంటి వాటిపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని అన్నారు. ప్రజలు విషయాన్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నాయకులు పూర్తిగా వైఫల్యం చెందడానికి ఈ ఘటనే నిదర్శనం అని అన్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు మురుగు నీరు నిల్వ ఉండకుండా వెళ్లే మార్గం దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, మండల అధ్యక్షులు గ్యార శేఖర్, కోశాధికారి మునుగోటి సత్తయ్య, నాయకులు అన్నమళ్ళ సైదులు, భీంపాక అజయ్ బిఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.