అర్హులైన వారికే దళిత బంధు ఇవ్వాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి….

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 05: సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కట్ట గాలిభ్ రోషన్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ, అర్హులైన దళితులకి దలిత బంధు రావటమ లేదని మంగళవారం దళిత సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మా అంబేద్కర్ సంఘంపై వివక్ష చూపిస్తున్నాడని, గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ క్యాంస విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా మా అంబేద్కర్ సంఘ నాయకులను ఆహ్వానించకుండా అవమానపరిచడని తెలిపారు. మళ్లీ ఇప్పుడు దళిత బంధు పథకం ఎంపికలో మా సంఘంపై ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నాడని అన్నారు. ఎమ్మెల్యే అనుచరులకే దళిత బంధు పథకం అనే పద్ధతి మార్చుకోవాలని తెలిపారు. అర్హులైన దళితులకు ఎంపిక జాబితాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గ్రామంలో మా సంఘంపై వివక్ష చూపిస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గ్రామంలో దళిత బంధు ఎంపికలో పారదర్శకత పాటించకుంటే రానున్న రోజుల్లో మా ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘ నాయకులు మందుగుల బాలకృష్ణ, గుండమల్ల మల్లేష్, ఈసం సైదులు,గుండమల్ల కృష్ణ, మందుగుల ధనరాజ్,వలిగొండ యాదయ్య, ఏం గాలయ్య, బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top