జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రాణి రవి
నల్గొండ/మునుగోడు, ప్రజానేత్రం, డిసెంబర్ 30: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హామీలను, సంక్షేమ పథకాలు త్వరలోనే అమలు అవుతాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్, మునుగోడు జడ్పీటీసీ నారబోయిన స్వరూప రాణి రవి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీల ధరకాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మునుగోడు మండలం చొల్లేడు గ్రామంలో శనివారం ఆమే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధరకాస్తు ఫారాలు గ్రామాలలో కొంతమంది తెలియక కొనుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని దయచేసి ఎవరు కొనుక్కోవద్దని ప్రభుత్వ అధికారులు మీ దగ్గరకు వచ్చి ఉచితంగా అందజేస్తారని తెలిపారు. మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి మీ దరకాస్తులు స్వీకరిస్తారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. ఇచ్చిన అన్ని హామీలు త్వరలోనే అమలు అవుతాయి, లబ్దిదారులు అప్లై చేసుకోవాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని ఆమేతో పాటు అధికారులు ప్రజలకు గ్రామ సభలో చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, సూపరిండెంట్ భాస్కర్, సర్పంచ్ జనిగల మహేశ్వరి, ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య, ఉప సర్పంచ్ గోదాల శంకర్ రెడ్డి, ఆర్ఐ నాగరాజు, ఎఈఓ నరసింహ, ఆర్డబ్ల్యూ ఎఈఈ మణిదీప్, ఏపీవో శ్రీను, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.