మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 10: మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇందిరానగర్ కాలనీ చౌరస్తాలో (ఐసిడిఎస్) అల్వాల్ ప్రాజెక్టులో అంగన్వాడి ఉద్యోగాల నిరవధిక సమ్మె గోడపత్రికని ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ప్రధాన కార్యదర్శి నండూరి కరుణ కుమారి జాయింట్ యాక్షన్ కమిటీ, సిపిఐ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రచ్చ కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా నండూరి కరుణ కుమారి మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం రూ 26 వేలు చెల్లించాలి, గ్రాట్యుటీ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు, ఇతర సమస్యలు పరిష్కరించాలని దేశంలో (ఐసిడిఎస్) ప్రారంభించి 48 సం. రాలు అవుతుంది. రానున్న 2. సం. రాల కాలంలో అర్థ శతాబ్ది ఉత్సవాలు జాకోబోతున్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కారం చేయలేకపొగ ఉద్యోగుల చేస్తున్నటువంటి సమ్మెను విచ్ఛిన్నం చేయాలని ప్రభుత్వం అధికారులు అనేక ఒత్తిడిలు తెచ్చి అంగన్వాడి ఉద్యోగులను బెదిరిస్తున్నారని. ఈ బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరించారు. క్రింది స్థాయిలో అధికారులు సెంటర్ తాళాలు అప్పచెప్పాలని వత్తిడి తెస్తున్నారు. సకల జనుల సమ్మె కాలంలో అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రంగాల వారు కార్యాలయాలకు తాళాలు వేసి సమ్మెలో పాల్గొన్నారని. దీనిని ప్రభుత్వం అధికారులు గమనించాలని తెలిపారు. తాళాలు ఇవ్వమని ఇప్పుడు వత్తిడి చేయడం తగదని అన్నారు. సమ్మె రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఎవరైనా సమ్మె చేయవచ్చని తెలిపారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చలకు పిలిచి సమ్మె విరమింప చేయాలని డిమాండ్ చేశారు. బెనిఫిట్ టీచర్ కు ఒక లక్ష ఆయాలకు50 వేలు ఇచ్చి అంగన్వాడి పిఆర్సికి అంగీకరించడం లేదని కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదనపు పనులతో అనేక ఇబ్బందులు పడుతున్నారని అనేకమంది అనారోగ్యాల పాలయ్యారని అన్నారు. ప్రభుత్వం సమ్మె విచ్చన్నం చేసే కుట్రలు మాని అన్ని సంఘాలను చర్చలకు పిలిచి డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదని అంగన్వాడి ఉద్యోగుల సమ్మె విచ్చిన్నం చేయాలని చూస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కో స్టేట్ కోశాధికారి ప్యారి జాన్, ఏఐటీయూసీ మండల కార్యదర్శి దండు రమేష్, సిపిఐ పార్టీ ఇంద్రానగర్ శాఖ కార్యదర్శి మాచర్ల కనకయ్య, మేడిపల్లి మండల ఏఐటీయూసీ అంగన్వాడీ టీచర్స్ సులోచన, ధనలక్ష్మి, మేరీ, కృష్ణకుమారి, మణెమ్మ, కల్పన, సంతోష, సుకన్య, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.