జుజ్జులరావుపేటలో “అంతా రామమయం”

ఉమ్మడి ఖమ్మం బ్యూరో, ప్రజానేత్రం, మార్చి 02: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజ్జులరావుపేట గ్రామంలో శనివారం నాడు అంగరంగ వైభవంగా నూతన రామ మందిరము శంకుస్థాపన గ్రామ పురోహితులు భైరవభట్ల రామశేషు శర్మ మరియు వేద పండితుల ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన సభ్యులు తుమ్మల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పెద్దల భక్తుల సహాయ సహకారాలతో, కమిటీ సభ్యుల సూచనలతో ఆరు నెలల లోపే శ్రీ సీతారాముల పట్టాభిషేకం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ గ్రామ పురోహితులు పూజలో పాల్గొన్న అర్చకులకు పూజలో పాల్గొన్న దంపతులకు కమిటీ సభ్యులు అందరు ధన్యవాదాలు తెలిపారు.

Scroll to Top