మంత్రి సురేఖను కలిసిన శేర్లింగంపల్లి కాంగ్రెస్ నాయకులు

శేర్లింగంపల్లి, ప్రజానేత్రం, ఫిబ్రవరి 29: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా శేర్లింగంపల్లి అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ, వాసు, కొఠారి వెంకటేష్, కావూరి ప్రసాద్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top