కంఠమహేశ్వర ఆలయ నిర్మాణానికి విరాళం అందజేత

నాంపల్లి, ప్రజానేత్రం, ఫిబ్రవరి 29: మండలంలోని నరసింహుల గూడెం గ్రామ స్థానికుల కోరిక మేరకు గురువారం కంఠ మహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి నాంపల్లి వైస్ ఎంపీపీ పానగంటి వెంకన్న గౌడ్ రజిని దంపతులు గురువారం రూ.2లక్షల 50వేలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా కంఠమహేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి విరాళం అడగగానే కాదనకుండా మా కోరిక మేరకు అందజేసిన వైస్ ఎంపీపీ పానుగంటి వెంకన్న గౌడ్ రజినీ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి, స్థానిక మాజీ సర్పంచ్ కాటం వెంకటయ్య, నాగరాజు, శివరాజ్ గౌడ్, వెంకటరెడ్డి, స్వామి, మహేష్, లక్ష్మయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top