మృతుల కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ కార్యకర్తలు…

నాంపల్లి, ప్రజానేత్రం, ఫిబ్రవరి 29: మండలంలోని తుమ్మలపల్లి గ్రామ నివాసి కాంగ్రెస్ కార్యకర్త సన్నాయిల సత్యనారి గురువారం అకస్మాత్తుగా మృతి చెందారు.విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు మృతుని కుటుంబ సభ్యులకు రూ .20 వేల ఏడు వందలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఇందులో కందికట్టే వెంకటేష్,అకిటి మహేష్, పూర్ణ వెంకటయ్య, లక్ష్మయ్య, అన్నేపాక నాగరాజు, యాదయ్య, వెంకన్న, నరేష్, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top