నల్గొండ జిల్లాలో రైతు పొలంలో మొసలి కలకలం…

నల్గొండ, ప్రజానేత్రం, ఫిబ్రవరి 29: నల్గొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రంలోని ముత్యాలమ్మ గుడి సమీపంలో ఉన్న ఓ రైతు పొలంలో మొసలి కలకలం రేపుతూ రైతులను భయాందోళన గురిచేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. గమనించిన రైతులు భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆనందరెడ్డి, సిబ్బంది మొసలిని స్వాధీన పరుచుకున్నారు.

పొలాలకు సమీపంలో ఉన్న చెరువు నుండి ముసలి పంట పొలాల్లోకి వచ్చిందని ఆ ప్రాంత రైతన్నలు భయంతో ఉక్కిరబిక్కిరి అవుతున్నారు. పొలాలకు సమీపంలో ఉన్న చెరువులో ముసలిని పలుమార్లు చూసినట్టు పలువురు రైతులు చెబుతున్నారు.

Scroll to Top