మేడిపల్లి, ప్రజానేత్రం, మార్చి 07: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎస్‌ఆర్ (సాయి రామ్) ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు శంషాబాద్ సాయిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన పరీక్ష ప్యాడ్‌లు,పెన్నులు పరీక్షలు రాయడానికి తన వంతు సహాయంగా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఈ సందర్భంగా సాయిరాం రెడ్డి మాట్లాడుతూ ఇష్టంతో చదివి ఉన్నత స్థానంలో నిలవాలని అప్పుడే సమాజంలో తగిన గుర్తింపు గౌరవం లభిస్తుందన్నారు. చదువుతోనే ఎదైనా సాదించగలరని అన్నారు.ఎస్ ఆర్ ఫౌండేషన్ పేద విద్యార్థులకు,పేద ప్రజలకు ఎల్లప్పుడూ సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటుందని తెలిపారు.