సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 21: ఉద్యమాలకు పురుడు పోసిన గడ్డ మునుగోడు నియోజకవర్గం బీసీ ఎస్టీ ఎస్సి బహుజనజనాభా 90%ఉన్న బహుజనల అడ్డ అగ్రవర్ణాల పాలకుల పాలనలో నష్టపోయిన ఎందరో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల ను మునుగోడు శాసనసభల లో అడుగుపెట్టనివ్వకుండా చూసి బహుజన బిడ్డలు ఎదిగితే మా ఆటలు సాగమని కొందరు రాజకీయ నాయకులు స్వార్థపూరిత కుట్రలతో కుతంత్రాలతో పనిచేస్తున్నారని ప్రముఖ హైకోర్టు న్యాయవాది, తెలంగాణ సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు నర్రి సామి అన్నారు. నేటికి మునుగోడులో దొరల రాజ్యం సాగుతుంది గతంలో కాంగ్రెస్ కమ్యూనిస్టు పాలనలో రెడ్డి కమ్మ ఆదిపత్యం కొనసాగింది దళిత బహుజనుల బిడ్డలు ఎదుగుతున్న ఏ రాజకీయ పార్టీ నాయకులు సీటు ఇచ్చి గెలిపించుకోలేకపోయింది పెత్తందార వ్యవస్థలో కొమ్ముకాస్తున్న రెడ్డి వెలమ మాత్రమే 30 సంవత్సరాలుగా ఏలుబడి సాగుతుంది రాష్ట్రంలో అదే తీరుగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ తెలుగుదేశం బిజెపి బీఆర్ఎస్ బహుజన బిడ్డలకు రాష్ట్రముఖ్యమంత్రి ఇచ్చిండ్రా అన్నారు 90% జనాభా కలిగి ఉన్న కేవలం 10 శాతం ఉన్న రెడ్డి కమ్మ వెల్మలు మాత్రమే రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని చేపడుతున్నారు మునుగోడులో రాజ్యాధికారాన్ని చేపడుతున్నారు మునుగోడు బహుజన ఎస్సీ ఎస్టీ మేధావి ప్రజలారా మేలుకోండి ఇకనైనా మునుగోడును ఏలుకోనీ అభివృద్ధిని చేసుకుందాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నాం ఎవరి మోచేతి నీళ్లు తాగి బతకవలసిన కర్మ లేదు ఓట్లు మనవి- సీట్లు మనవే మన ఓట్లు మనం వేసుకొని మునుగోడును అభివృద్ధి పథంలో ఏలుకుందం ఈ ఓటు హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు దానిని అగ్రవర్ణాల వారికి తాకట్టు పెట్టినట్లయితే మన జీవితం మనమే నాశనం చేసుకున్న వాళ్లమైతామన్నారు రాబోయే మునుగోడు ఎన్నికలలో అధికార టిఆర్ఎస్ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బిజెపి నుండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి చలమల్ల కృష్ణారెడ్డి పాల్వాయి స్రవంతి రెడ్డి వీరికి అధికార పార్టీ నాయకులు కట్టబెట్టాలని చూస్తున్నారు. ఈ అధికార పార్టీ నాయకులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు కనిపించడం లేదా విద్యావంతులు మేధావులు అనేక రంగాలలో ఉన్న దళిత బహుజన బిడ్డలు గుర్తించడంలో అధికార పార్టీ నాయకు లకు గుర్తు రావడం లేదు ఎందుకంటే ఎన్నికల్లో బీరు బిర్యానీ ప్యాకెట్స్ డబ్బులు పంచి గెలిచే వారికి టికెట్ ఇస్తారు కానీ సామాన్యుడు చేసిన పాపమేమిటి అగ్రవర్ణాలు వారు చేసిన పుణ్యం ఏమిటి. మాన ఓటుతో గెలిచి మానకు అందనంత అందలానికి ఎక్కి మాన పైనే సవారీ చేస్తుంన్నారు. మునుగోడు నియోజకవర్గం లోని 90% జనాభా ఉన్న బహుజన నాయకులకు ఏరా వేసే చిన్నా చితక పదవుల కోసం ఆశపడి ఉద్యమాన్ని నీరుగారకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు రాబోయే ఎన్నికలలో మునుగోడు శాసనసభ్యునిగా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన నేను నాకు ఒక అవకాశం కల్పించినట్లయితే అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి మునుగోడు నీ సస్యశ్యామలంగా చేస్తానన్నారు.