బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లేష్ కు ఘన సన్మానం

మునుగోడు, ప్రజానేత్రం, మార్చి 10: బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నేరటి మల్లేష్ కు తనతో పాటు విద్యాభ్యాసం చేసిన మిత్రులు ఆదివారం ఘనంగా శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా అనతి కాలంలోనే బీసీ సంక్షేమ సంఘం లో ఉన్నత స్థాయిలో ఉన్నందుకు సంతోషకరమన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నతమైన పదవుల్లో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. సన్మానించిన వారిలో నల్గొండ అంజి, పోలగోని భాస్కర్, పందుల రాజు, గుంటుక శాంతి కుమార్, పందుల రాజేష్, బండి సైదులు, గిట్టగోని శంకర్, జిట్టగోని వెంకన్న, నరేష్, నరేందర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top