బీసీల సింహగర్జన పోస్టర్ ఆవిష్కరించిన: జాజుల శ్రీనివాస్ గౌడ్…

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 04: సంస్థాన్ నారాయణపురం మండలంలో బీసీల సింహగర్జన గోడపత్రికలను సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరై మాట్లాడుతూ సామాజిక న్యాయం సబండ వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ నెల 10న హైదరాబాదులో జరిగే బీసీల సింహగర్జన నిర్వహిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని  బొంద పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలను భారతం పట్టాలన్నారు. ఓట్లు బీసీలవి, పదవులు అగ్రకులాలకు కేటాయిస్తూ రాజకీయా పార్టీలు బిసిలను మోసం చేస్తున్నాయని వారన్నారు, అర శాతం లేని వాళ్ళు 12 టికెట్లు తీసుకొని, ఐదు శాతం లేని వాళ్ళుకు 40 టికెట్లు, 60 శాతం ఉన్న బిసిలకు 23 టికెట్లు కేటాయించి బిఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఎవరి జనాభా దామాషా ప్రకారం వారికి సీట్లు కేటాయించే విధంగా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడానికి బీసీల ఎజెండాగా 2023 ఎన్నికల నిర్వహించే విధంగా పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి బోల్లేపల్లి లక్ష్మణ్, యువజన సంఘం అధ్యక్షులకు రామకృష్ణ, బిసి సంఘం సీనియర్ నాయకులు దుసరి వెంకటేశం, యువజన సంఘం ప్రధాన కార్యదర్శి కొత్త భాను, రాష్ట్ర ఉపాధ్యక్షులు వరికుప్పల మధు, డివిజన్ అధ్యక్షుడు బండి గారి వెంకటేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు చెర్క సత్తమ్మ, భరత్, భాస్కర్, నవీన్, అశోక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top