ఎమ్మెల్యే కెపి వివేకానంద్ ను గెల్పించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 04: నియోజకవర్గంలో 132 జీడిమెట్ల డివిజన్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రంగారెడ్డి బండ, జొన్న బండలో సోమవారం ఎమ్మెల్యే కె.పి వివేకానంద్, కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నాశ్రీశైలం యాదవ్ తో కలిసి 105వ రోజు ప్రగతి యాత్ర చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన రోడ్లు, డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు పరిశీలించారు. అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాగా అక్కడక్కడా నెలకొన్న భూగర్భడ్రైనేజీ, అంతర్గత రోడ్లు, కరెంటు పోల్స్, తీగలు మార్చాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కాలనీ అభివృద్ధే తమ ధ్యేయం అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం ఎళ్లవేళల అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ తమ బస్తి అభివృద్ధికి సహకరిస్తున్నఎమ్మెల్యే కె పి వివేకానంద్ ను రానున్న ఎన్నికలలో ముచ్చటగా మూడో సారి బారి మెజారిటీతో ఎమ్మెల్యేగా గెల్పించుకుంటాం అని బిఆర్ఎస్ పార్టీకె తమ పూర్తి మద్దతని, ముఖ్యమంత్రి కెసిఆర్ ని తిరిగి మూడో సారి ముఖ్యమంత్రిగా గెల్పించుకుంటామని ప్రకటిస్తూ బస్తి వాసులు ఏకగ్రీవ తీర్మానం చేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులూ కుంట సిద్దిరాములు, సంపత్ మాధవ్ రెడ్డి, గుమ్మడి మధుసూదన్ రాజు, మఖ్సూద్ అలీ, కాలే నగేష్, అనిల్, గణేష్, మహిళా నాయకులూ ఇందిరా రెడ్డి, బస్తి వాసులు రామిరెడ్డి, లక్ష్మయ్య, ముంతాజ్ బీ, రుక్కమ్మ, యూసఫ్, సురేష్, భారతమ్మ, శ్రీను, వెంకటయ్య, బాలయ్య, బాలమణి బస్తీవాసులు తదితరుల పాల్గొన్నారు.

Scroll to Top