నాంపల్లి, ప్రజానేత్రం, ఆగస్టు 04: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత అన్నారు. సోమవారం గ్రామ పంచాయతీకి ప్రభుత్వము నుండి వచ్చిన క్రీడా సామాగ్రిని ఆమె ఆయా గ్రామాల కార్యదర్శిలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రతి గ్రామంలో పల్లె క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి అందులో యువత క్రీడలను ఆడుకోవడానికి వీలుగా ప్రభుత్వమే ఉచితంగా క్రీడా సామాగ్రిని అందిస్తుందని అన్నారు. గతంలో పల్లెల్లో ఆట స్థలాలు లేక యువత తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అటువంటి ఇబ్బందులను తొలగించడానికి ప్రభుత్వమే క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఈ క్రీడా సామాగ్రిలు పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలోనే అందుబాటులో ఉంటాయని యువత వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు . దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలను అండగా ఉంటున్న ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి , ఎంపీడీవో శేషు కుమార్ ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.