రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ కే మా మద్దతు…

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 02: నియోజకవర్గంలో 129 సూరారం డివిజన్ పరిధిలోనిలో షాపూర్ నగర్లో గల బడి మజీద్ (జమ మజీద్ మొహమ్మదీయ)లో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా మ ముఖ్యమంత్రి కెసిఆర్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కెపి వివేకానంద్ ప్రకటించిన నేపథ్యంలో బడి మజీద్ కమిటి సభ్యులు శనివారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద కు అభినందనలతో ఆయన ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని. కుల మతాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో ఇప్పటికే ఎన్నో పథకాలను అమలు చేస్తూ మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటును తొలగించేందుకు కృషి కొనసాగిస్తున్నది. రానున్న ఎన్నికలలో మన కె పి వివేకానంద్ ని బారి మెజారిటీతో మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని కెసిఆర్ కు బహుమతిగా ఇస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అద్యేక్షులు పుప్పాల భాస్కర్, మైనారిటీ డివిజన్ అద్యేక్షులు ఎం.డి మొయిజ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మఖ్సూద్ అలీ, ఫిరోజ్, ప్రభుదాస్, మునీర్, అఖిల్, సాజిద్, మజీద్ కమిటీ చీఫ్ అడ్వైసర్ మహమ్మద్ నసీరుద్దీన్, ప్రెసిడెంట్ అల్హాజ్ షేక్ మహమ్మద్, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అమీర్ ఖాన్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఒమేర్, ట్రెఅసురేర్ మహమ్మద్ నూరుసాథ్, సెక్రటరీ మహమ్మద్ మఖ్బూల్, అశ్వక్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top