కిషన్ రెడ్డి దీక్ష భగ్నం పై భారతీయ జనతా పార్టీ నిరసన…

సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 14: సంస్థాన్ నారాయణపూర్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి దీక్ష భగ్నం చేసినందుకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి  నిరసన తెలుపుతూ గురువారం మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించచారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి సూర్యపల్లి శివాజీ మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం లేదు నయా నిజాం ప్రభుత్వం ఉన్నట్టుగా  కనబడతా ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో రాస్తా రోకలు ధర్నాలు దీక్షలు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రాజ్యాంగానికి మచ్చ ఏర్పడే ప్రమాదం ఉన్నది కావున ప్రజలు మేల్కొవాలని గుర్తు చేశారు. మండల పార్టీ జనరల్ సెక్రెటరీ ఆత్కూరి గిరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వంగరి రఘు దాసోజు, వెంకటాచారి, సికిలామెట్ల వెంకటేశం, బండమీది కిరణ్, గూడూరు ఇంద్రసేనారెడ్డి, బూస శీను, వీరమల్ల జంగయ్య, బండమీది రాజు,  కట్కూరి శ్రీకాంత్,  మంజునాథ రెడ్డి, కట్కూరి లక్ష్మణ్ గౌడ్, మాసాని సాయి, బొంగు మధు, బద్దం కిరణ్, దేప రవీందర్రెడ్డి, బొమ్మ కంటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top