కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 14: నియోజకవర్గంలో గాజులరామారం డివిజన్ పరిధిలోని ఎచ్ఏఎల్ కాలనీలోని న్యూ సిటీ ప్యాలస్ ఫంక్షన్ హాల్ లో కుత్బుల్లాపూర్ మండల్ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన టీచర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావుతో కలిసి పాల్గొని మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందని పేర్కొన్నారు. ఈ విశ్వంలో ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ గౌరవనీయమైన వృత్తిలో ఉంటూ ఎంతో మంది జీవితాలను తీర్చిదిద్దుతు విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేసిన టీచర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శివయ్య, ప్రెసిడెంట్ వరప్రసాద్, జనరల్ సెక్రెటరీ మహేష్ కుమార్, ట్రెజరర్ దయాకర్, చీఫ్ అడ్వైజర్ శ్రీనివాస్ గౌడ్, అడ్వైజర్లు కిషన్ రావు, నర్సిరెడ్డి, నర్సింలు గౌడ్, మల్లేశం,రామేశ్వర్ రెడ్డి మరియు పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజు, అడ్వకేట్ కమలాకర్, నవాబ్, చిన్న చౌదరి, గోపాల్ యాదవ్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.