యాదాద్రిశుడిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్-కమల దంపతులు…

ముచ్చటగా మూడో సారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో విజయం సాదిస్తాం: తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్

యాదాద్రి భువనగిరి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 14: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ – కమల దంపతులు గురువారం కుటుంబ సమేతంగా స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికీ ఆలయ సంప్రదాయంగా అర్చకులు స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేప్పట్టిన అభివృద్ధి పథకాలకు ప్రతి ప్రక్ష పార్టీలకు వణుకు పడుతుందన్నారు. ప్రతి పక్షాలు విమర్శించే స్థాయి లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. సతీమణి కమల పుట్టినరోజు సందర్భంగా స్వామి వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు. స్వామి వారి ఆశీస్సులు కేసీఆర్ పై ఉండాలని, కేసీఆర్ ఆశీస్సులు మాపై ఉండాలన్నారు. సాధారణ ఎన్నికలకు వెళ్లేందుకే తాము సిద్ధంగా ఉన్నామని, జమిలి ఎన్నికలు స్పష్టత లేదన్నారు. పార్లమెంట్ కమిటీ జమిలి పై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ మూడో సారి యాట్రిక్ సీఎం అవుతారని, దేశంలో ఎక్కడ లేని విధంగా సిట్టింగ్ లు అందరికి టికెట్లు ఇచ్చారని చెప్పారు. ముచ్చటగా మూడో సారి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో విజయం సాధిస్తామన్నారు.

Scroll to Top