నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 13: అన్ని రకాలుగా అభివృద్ధిలో వెనుకబడిన మునుగోడును రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటుచేసి న్యాయం చేయాలని మునుగోడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సురిగి నరసింహ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మునుగోడు రెవిన్యూ డివిజన్ తో పాటు మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని మాదగాని వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు కాంగ్రెస్ పార్టీ తరపున బుధవారం వారు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాలుగా వెనుకబడిన మునుగోలు రెవెన్యూ డివిజన్ తో పాటు మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్నారు. అవసరమైతే ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ గా కొనసాగుతున్న నల్గొండ లోనే ఉంచాలని, చండూరులో కలపవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్వాయి చెన్నారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు మేక ప్రదీప్ రెడ్డి, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నక్క వెంకన్న, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు యాసరాని దినేష్ తదితరులు పాల్గొన్నారు.