ఉరుమడ్లకు సర్వేక్షన్ గ్రామీణ ఉత్తమ అవార్డు…

చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 13: మండలంలోని ఉరుమడ్ల గ్రామపంచాయతీ జాతీయ స్థాయి పోటీలలో అత్యదిక మార్కులు సాధించి పోటీలలో గ్రామపంచాయతీ అవార్డులకు ఉరుమడ్ల గ్రామపంచాయతీ కి జిల్లా స్థాయి అవార్డు కు ఎంపిక అయ్యింది. ఈ అవార్డు ను నల్గొండ లో కలెక్టర్ ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి చేతుల మీదుగా గ్రామ సర్పంచ్ కంచర్ల శ్రీనివాస్ రెడ్డి, పంచాయత్ సెక్రటరీ ఎం సిద్ది వీర సోమయ్య లకు అవార్డు కింద ప్రశంసా పత్రము, షీల్డ్ బహుకరించారు. ఈకార్యక్రమంలో జడ్పిటిసి సుంకరి, ధనమ్మ, ఎంపీడీవో లాజర్ ఎంపీ.డి.ఓ పద్మ అవార్డు ప్రధాన ఉత్సవంలో పాల్గొని ప్రశంసించి సన్మానించారు.

Scroll to Top