స్వచ్ఛభారత్ సర్వేక్షణ ఉత్తమ అవార్డులకు మునుగోడు, జక్కలవారి గూడెం గ్రామాలూ ఎంపిక…

నల్గొండ, ప్రజానేత్రం, సెప్టెంబర్ 13: స్వచ్ఛభారత్ సర్వేక్షణ గ్రామీణ జిల్లా ఉత్తమ అవార్డులకు మునుగోడు, జక్కల వారి గూడెం గ్రామాలు ఎంపికయ్యాయి. వారికి బుధవారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉత్తమ అవార్డులను అందజేశారు. ఎంపిపి కర్నాటి స్వామి యాదవ్, మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు, జక్కల వారి గూడెం సర్పంచ్ జక్కలి శ్రీను, పంచాయతీ కార్యదర్శులు మురళీమోహన్, శ్వేత లకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతులమీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు నారబోయిన స్వరూపా రాణి రవి, ఎంపిడివో భాస్కర్, ఎంపీవో సుమలత, సూపరింటిడెంట్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top