సంస్థాన్, ప్రజానేత్రం, అక్టోబర్ 04: సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుదవారం ఆయన సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక వడ్డేపల్లి శివప్రసాద్, కొలుగూరి దశరథ, కొలువురు శ్రీకాంత్, గంజి అశోక్, ధనుంజయ మొదలగువారు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ గెలుపుకు కృషి చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ జక్కడి జంగారెడ్డి, జడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు లారీ బిక్షం,ప్రధాన కార్యదర్శి ఎడ్ల సత్తయ్య, రైతు సంఘం అధ్యక్షులు జక్కిడి యాదిరెడ్డి, చింతకింది ఉష, సింగం కృష్ణ, బాకారం నాగరాజు, నార్సిహ్మ నాయక్, సంద శ్రీకాంత్, అరవింద్, హఫీజ్,షరీఫ్ కిరణ్, పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.