కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్: జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 01: పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్త కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం పసునూరు గ్రామానికి చెందిన ఆకారం పెంటమ్మ కుటుంబానికి రు. 10వేలు, మెల్లవాయి గ్రామానికి చెందిన వేముల నరసింహ కుటుంబానికి రూ.10 వేలు, చల్లవానికుంట గ్రామానికి చెందిన రాపోతు వెంకమ్మ కుటుంబానికి రూ.5వేలు, నేనావత్ సుశీల కుటుంబానికి రూ.5 వేలు, రామస్వామి యాదగిరి కుటుంబానికి రూ.5వేలు అందజేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం అన్నారు. పార్టీ అభివృద్ధి కొరకు పని చేసిన ప్రతి కార్యకర్త కుటుంబాన్ని పార్టీ అన్నివేళలా అండగా ఉంటూ వారి అభివృద్ధి కొరకు కృషి చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావున కార్యకర్తలందరూ జాగ్రత్తగా ఉండి , అన్నీ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్న సీఎం కేసీఆర్ కు అండగా నిలవవలసిన అవసరం ఉందన్నారు. రాబోయేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేస్తూ కార్యకర్తలందరూ ఐక్యంతో ఉండి పార్టీ గెలుపునకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్.కె అబ్బాస్, బీఆర్ఎస్ నాయకులు గుండెబోయిన నారాయణ, అన్నపాక కిరణ్, రాబోతు సత్యనారాయణ, జింకల నరేష్ , ఎస్ కే జానీ, ధనుంజయ చారి, గట్ల భాస్కర్ రెడ్డి , శేఖర్ గౌడ్ , పంబాల వెంకటయ్య , జజ్జన సైదులు, ఆకారపు నరసింహ , లచ్చయ్య , రాములు , రాజా , భాస్కర్ , రవి , లింగయ్య , కోటి , కృష్ణ తదితరులు ఉన్నారు.

Scroll to Top