కార్యకర్తల కుటుంబాలకు అండగా బీఆర్ఎస్: ఏడు దొడ్ల రవీందర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 24: మండలంలోని దామెర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క కుమార్ కూతురు హైదారాబాద్ లో దిశా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నది. కార్యకర్తల ద్వారా సమాచారం తెలుసుకున్న రైతుబంధు సమితి మండల కన్వీనర్ దొడ్ల రవీందర్ రెడ్డి ఆదివారం ఆసుపత్రికి వెళ్లి పాప పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆర్థిక సాయంగా రూ.10 వేలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది అని అన్నారు

Scroll to Top