సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 24: హైదరాబాదులోని కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో అక్టోబర్ 6, 7,8 వ తేదీల్లో నిర్వహించే ఫోటోగ్రాఫర్స్ ఎక్స్పోను ఫోటోగ్రాఫర్ లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు భీమిడి మాధవరెడ్డి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని గ్రంధాలయం వద్ద ఫోటో ఎక్స్పో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శేఖర్,మండల గౌరవ అధ్యక్షులు పాలకూర్ల యాదయ్య, కొండ శీను, అధ్యక్షుడు పాష, ప్రధాన కార్యదర్శి నీళ్ల రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు అరవింద్ రెడ్డి, కొండ శ్రీకాంత్, లింగస్వామి, నాగార్జున, సాయి, చిలువేరు శేఖర్, దినేష్ ప్రదీప్, పోచంపల్లి మండల అధ్యక్షుడు పాండు తదితరులు పాల్గొన్నారు.