ఆదర్శనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు

వేలం పాటలో 3లక్షల95 వెయ్యిలకు లడ్డు దక్కించుకున్న పాదిహరి బిలాసిని, ప్రకాష్ చంద్ర దంపతులు

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 28: బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఆదర్శనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.చివరి అంకంలో భాగంగా నిర్వహించన లడ్డూ వేలంపాటలో అదర్శనగర్ కాలనీకి చెందిన పాదిహరి బిలాసిని,ప్రకాష్ చంద్ర దంపతులు 3లక్షల95 వెయ్యిల రూపాయలకు దక్కించుకున్నారు.వారిని కమిటీ సభ్యలు శాలువాతో సన్మానించారు.ఈ మేరకు దంపతులు మాట్లాడుతూ నవరాత్రులు ఎంతో ఘనంగా పూజించిన లడ్డును మాకు దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ, కాలనీవాసులు పాల్గోన్నారు.

Scroll to Top