మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 28: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ పరిధిలోని మనసాని కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.తొమ్మిదో రోజు గణనాథుని కావాలి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా లడ్డు వేలంపాట జరిగింది.ఈ వేలంపాటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకులు మచ్చ వరలక్ష్మి నర్సింహులు దంపతులు స్వామివారి లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ రాపోలు ఉపేందర్,మేడ్చల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వుప్పుగల్ల ప్రశాంత్,బోడుప్పల్ కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆసర్ల బీరప్ప,మనసాని కాలనీ అసోసియేషన్ సభ్యులు,మహిళలు కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.