వెస్ట్ భీమ్ రెడ్డి నగర్ లో గణనాథునికి ఘణమైన పూజలు

  • వినాయకుడికి వైభవంగా కుంకుమార్చన, పుష్పార్చన…
  • ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి-ఉషారాణి దంపతులు…

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 28: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని వెస్ట్ భీమ్ రెడ్డి నగర్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.ఈ ఉత్సవాలలో భాగంగా పర్యావరణహితమైన మట్టి గణపతిని ప్రతిష్టించి కాలనీవాసులంతా కుటుంబ సభ్యులతో ప్రతినిత్యం కుంకుమార్చన, పుష్పాభిషేకం,వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.10రోజు పూజలో భాగంగా పన్నాల బుచ్చిరెడ్డి కుటుంబ సభ్యులు శ్రీ గణనాధునికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి- ఉషారాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మా రెడ్డి మాట్లాడుతూ వెస్ట్ బీమ్ రెడ్డి నగర్ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి పండుగను మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహిస్తారని,ముఖ్యంగా మట్టి గణపతిని ప్రతిష్టించి పలువురికి ఆదర్శంగా నిలిచారని,అత్యంత వైభవంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకు కాలనీవాసులను కల్చరల్ సొసైటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

Scroll to Top