రూ.3 లక్షల ఎల్వోసి అందజేత: ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 28: పేదల వైద్యానికి ప్రభుత్వ సాయం అందజేస్తుది అని ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేత అన్నారు. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన పసుపుల చిలకయ్యకు సీఎం సహాయనిధి నుండి మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మంజూరైన రూ.3 లక్షల ఎల్ఓసి నీ ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ లబ్ది దారునీ కుటుంబం సభ్యులకు అందజేశారు. ఈ సంధర్బంగా అమే సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకి అందజేస్తున్నది కేవలం బీ ఆర్ ఎస్ ప్రభుత్వము మాత్రమే అన్నారు. ప్రజందరు సీఎం కేసీఆర్ కు అండగ ఉండవలసిన అవసరం ఉందన్నారు. ఈ సంద్భంగా లబ్ది దారులు మునుగోడు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జెల్లల సైదులు ,కడారి శీను పాల్గొన్నారు.

Scroll to Top