చిన్నారి చికిత్సకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రూ. 50 వేల ఆర్థిక సాయం

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 29: పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం కల్పిస్తూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని నామానాయక్ తండ కు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త వడ్త్యా వినయ్ పదిరోజుల క్రితం దైవ దర్శనం కోసం యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం ఘట్ కేసర్ వద్ద రోడ్డు ప్రమాదనికి గురి అయ్యింది. ఈ ప్రమాదంలో వినయ్ కూతురు దీక్షిత తలకు త్రీవంగా గాయలు అయ్యాయి. పాపకి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించారు. . పస్నూరు మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి పోగుల వెంకట్ రెడ్డి ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారు. చిన్నారికి మెరుగైన చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం హైదరాబాదులోని తన నివాసంలో రూ.50 వేల ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని అన్నారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలు అందరూ ఏకతాటిపై వచ్చి పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను గడపగడపకు అందుతున్నాయని వాటిని ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం కార్యకర్తలకు ఉన్నదని గుర్తు చేశారు. ప్రతి కార్యకర్త పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నామానాయక్ తండ సర్పంచ్ రామావత్ సుగుణబాబురావు, గ్రామ శాఖ అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top