యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన: మండలి చైర్మన్ గుత్త, ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల, ప్రజానేత్రం, సెప్టెంబర్ 28: మండల కేంద్రంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలు అమలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం యాదవుల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని ధీమానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా పరిషత్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆర్. మల్లికార్జున్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top