హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కేపిని గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన మాణిక్య నగర్ కాలనీ వాసులు

కుత్బుల్లాపూర్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 25: నియోజకవర్గంలోని 131కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని మాణిక్య నగర్ కాలనీ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అడిగిన వెంటనే తమ కాలనీలో మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి సహకరిస్తూ సంక్షేమ పధకాలను అర్హులైన కానీవాసులకు అందించడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కే పి వివేకానంద్ కి కాలనీ వాసులు అందరు అండగా నిలుస్తూ రానున్న ఎన్నికలలో తమ కాలనీ నుండి సంపూర్తి మద్దతు తెలియజేస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక బారి మెజారిటీ తో గెలిపించుకుంటామని మా కాలనీ అభివృద్ధిని కొనసాగించుకుంటామని వాసులు అందరు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కే ఎం గౌరీష్, మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర్ రావు, నియోజకవర్గ యూత్ అద్యేక్షులు సోమేశ్ యాదవ్, డివిజన్ అద్యేక్షులు దేవరకొండ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సత్తి రెడ్డి, మాజీ కౌన్సెల్ర్ సూర్య ప్రభ, కిషోర్ చారీ, స్వామి గౌడ్, నార్లకంటి బాలయ్య, జయం చారీ, సురేందర్ రెడ్డి, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి మహేష్, ఎం రాజేష్, జనరల్ సెక్రటరీ ఖలీల్ పాశా, ప్రవీణ్ కుమార్, కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టెంట్ హౌస్ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గుప్తా, తదితరులు కాలనీ వాసులు పాల్గొన్నారు.

Scroll to Top