మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 29: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వీరారెడ్డి నగర్ లో గతంలో బోడుప్పల్ గ్రామపంచాయతీ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి సీనియర్ సిటిజన్ భవనాన్ని నిర్మాణానికి కేటాయించడం, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు అడ్డుకోవాలని, అడ్డొస్తే పిడి యాక్ట్ కేసులు పెడతామని సవాల్ విసిరిన నేపథ్యంలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని,నేడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని,పోలీసు బలగాలని మోహరించి కాంగ్రెస్ నాయకులను పార్టీ కార్యాలయంలోనే దిగ్బంధించి సీనియర్ సిటిజన్ భవనానికి శంకుస్థాపన చేశాడని,ఒక మంత్రిగా సరైన విచారణ జరిపిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సీనియర్ సిటిజన్ ల కోసం ప్రభుత్వ స్థలంలో గతంలో వీరారెడ్డి పోతావ్ పార్క్ సమీపంలో 25 లక్షల కేటాయించడం కూడా జరిగిందని, అది వదిలేసి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై మంత్రి మల్లారెడ్డి స్థానిక నాయకుల కన్ను పడిందని, కాంగ్రెస్ పార్టీ దీనిపై తప్పకుండా పోరాడుతుందని,త్వరలోనే రాష్ట్ర నాయకులకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్,కార్పొరేటర్లు తోటకూర అజయ్,బొమ్మకు కళ్యాణ్, సీనియర్ నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.