కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పార్లమెంట్ ఎన్నికల మండల ఇంచార్జ్ నారబోయిన రవి ముదిరాజ్
మునుగోడు, ప్రజానేత్రం, మే 05: భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అయ్యింది కానీ భారీ మెజార్టీ కోసమే మా ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ ఎన్నికల మండల ఇంచార్జ్ నారబోయిన రవి ముదిరాజ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని చొల్లేడు గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 6 గ్యారంటీల అమలతో పాటు రుణమాఫీ మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించబోతుందని, రానున్న ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిక వేడితో గెలిపించుకొని దేశంలో కాంగ్రెస్ పాలన అధికారంలోకి తెచ్చుకొని మరింత అభివృద్ధికి బాటలు వేసుకుందామని ఓటర్లను కోరారు. భువనగిరి పార్లమెంట్ ఇంచార్జ్, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాల్వాయి చెన్నారెడ్డి, ఎంపీపీ కర్ణాటక స్వామి, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, మాజీ జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు నన్నూరి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బూడిద లింగయ్య, స్థానిక ఎంపీటీసీ వనం నిర్మల యాదయ్య, స్థానిక మాజీ సర్పంచ్ జనిగల మహేశ్వరి సైదులు, మాజీ సర్పంచ్ ముప్ప రవీందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గోదల శంకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు జంగిలి నాగరాజు, నాయకులు జనిగల ముత్యాలు, చిలుముల రుద్రయ్య, కదిరే లింగస్వామి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నక్క వెంకన్న తదితరులు పాల్గొన్నారు.