చామల గెలుపు ఖాయం మెజార్టీ కోసమే మా ప్రయత్నం: కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోనేటి యాదగిరి

చిట్యాల, ప్రజానేత్రం, మే 11: భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఖాయం అయ్యింది కానీ భారీ మెజార్టీ కోసమే మా ప్రయత్నం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోనేటి యాదగిరి అన్నారు. శనివారం ఉరుమడ్ల గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 6 గ్యారంటీల అమలతో పాటు రుణమాఫీ మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించబోతుందని, ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధిక మెజారిటీ తో గెలిపించుకొని దేశంలో కాంగ్రెస్ పాలన అధికారంలోకి తెచ్చుకొని మరింత అభివృద్ధికి బాటలు వేసుకుందామని ఓటర్లను కోరారు. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఎంపిటిసి పొలాగోని స్వామి,నాయకులు పల్లపు బుద్ధుడు,సోషల్ మీడియా ఇంచార్జ్ పట్ల జనార్దన్, జానపాల శ్రీను, పందుల గోపాల్, పొలాగోని శంకరయ్య, ఆనంతుల శంకరయ్య, పాకాల దినేష్, మేడబోయిన శ్రీనివాస్, మర్రి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top