రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

మేడిపల్లి, ప్రజానేత్రం, మే 08 : బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని పైళ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బుధవారం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 22 డివిజన్ పరిధిలో మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తానన్న హామీలు ఒకటి సక్రమంగా అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచుతారని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకు కేంద్రం లోని బీజేపీ చేసింది ఏమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలు, పట్టణాలు బిఆర్ఎస్ ప్రభుత్వం కెసిఆర్ సారాధ్యంలోనే అభివృద్ధి చెందాయని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపిస్తే మన నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోరంజన్ రెడ్డి, సాయి, మహేందర్, వెంకట్ రెడ్డి సతీష్, సంపత్, గౌతమ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top