కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి

మునుగోడు, ప్రజానేత్రం, మే 06: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని టీపీసీసీ రాష్ట్ర నాయకులు, పార్లమెంట్ ఎన్నికల మునుగోడు మండల ఇంచార్జీ నారబోయిన రవి ముదిరాజ్ కార్యకర్తలకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఊకొండి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులకు హాజరై మాట్లాడారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో మరింత అభివృద్ధి జరుగుతుందని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ ఇంచార్జీ కొలను రాజేందర్ రెడ్డి, మండల సమన్వయ కమిటీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top