10 వేల ఆర్థిక సహాయం అందజేసిన తోకల చంద్రకళ వెంకన్న

మునుగోడు/చండూరు, ప్రజానేత్రం, మే 06: ఆదివారం కురిసిన అకాల వర్షం కారణంగా చండూరు మండలం ఉడతల పల్లి గ్రామంలో బుసిపాక హుస్సేన్ అనే రైతుకు చెందిన రెండు పశువులు పిడుగుపాటుకు గురై మృతిచెందాయి. విషయం తెలుసుకున్న చండూరు మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ ఎంపీపీ తోకల చంద్రకళ వెంకన్న సోమవారం రైతు కుటుంబాన్ని పరామర్శించారు. పిడుగుపాటుతో స్వల్ప గాయాల పాలైన రైతును ఓదార్చి అండగా ఉంటామని ధీమానిచ్చారు. రైతు కుటుంబానికి తక్షణమే 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉడతలపల్లి ఎంపిటిసి కావాలి మంగమ్మ ప్రసాద్, బిఆర్ఎస్ టౌన్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్, మాజీ సర్పంచ్ బొమ్మరగోని లక్ష్మయ్య, పులకరం రామచంద్రం, మేరుగు వెంకన్న, మారగోని రాజు, కావాలి యాదగిరి, రాజు, శ్రీశైలం, చిన్న లింగయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top