కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి: గుత్తా అమిత్ రెడ్డి

చిట్యాల, ప్రజానేత్రం, మే 11: ఉరుమడ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ, వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు సుమారు100 మంది శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గుత్త అమిత్ రెడ్డి సమక్షంలో చేరారు. అనంతరం అమిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్ల పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీ గెలుపుతో మరింత అభివృద్ధి జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గుత్తా జితేందర్ రెడ్డి జిల్లా నాయకులు కోనేటి యాదగిరి, పల్లపు బుద్ధుడు,గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు,మాజీ ఎంపిటిసి పొలాగోని స్వామి, జానపల శ్రీను,పాకాల దినేష్, మర్రి అశోక్, పొలగోని శ్రీశైలం, గంగాపురం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top