నాంపల్లిలో గుత్తేదారు ఇష్టారాజ్యంగా సిసి రోడ్ల నిర్మాణం…

నాంపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 29: మండల కేంద్రంలోని బీసీ కాలనీలో సిసి రోడ్లు నిర్మించారు. కానీ సిసి రోడ్ కిరువైపులా మట్టి వేయడం మరిచారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సిసి రోడ్ కూడా నాణ్యత లేకుండా ఇస్టారీతిలో వేశారని,రోడ్డుకు ఇరువైపులా మట్టి పోయకపోవడంతో వాహనదారులకు, పిల్లలకు, పెద్దలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. వర్షాలు వచ్చినప్పుడు గుంతలలో నీరు చేరి మురికి నీరుగా తయారయ్యి… ఈగలు, దోమలు ఇంట్లోకి వస్తున్నాయని స్థానికులు అంటున్నారు. అసలే వర్షాకాలం దోమల వలన అనేక రోగాలైన డెంగ్యూ,మలేరియా తదితర వ్యాధులు సంభవించి చిన్నపిల్లలు మరణిస్తున్నారని, ఇప్పటికైనా స్పందించి సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు సిసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న గుంతల్లో మట్టి నింపాలని, అవంతరాలు కలవకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.

Scroll to Top