రూ. 5 లక్షల 5 వేలకు గణనాథుని లడ్డు కైవసం చేసుకున్న భరత్ రెడ్డి చిట్టి రెడ్డి…

మేడిపల్లి, ప్రజానేత్రం, సెప్టెంబర్ 29: దేవాది దేవుడు గణనాథుడు ప్రసాదం (లడ్డు) దక్కించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు హిల్స్ వ్యూ కాలనీ గణనాథుని లడ్డు దక్కించుకున్న కాలనీ అధ్యక్షులు భరత్ రెడ్డి చిట్టి రెడ్డి. ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం హిల్స్ వ్యూ కాలనీలో కొలువైన గణనాథుడు నవరాత్రులు ప్రత్యేక పూజలను అందజేశారు భక్తులు. ఉత్సవాల్లో భాగంగా లడ్డు వేలంపాట నిర్వహించగా కాలనీ అధ్యక్షులు భరత్ రెడ్డి చిట్టి రెడ్డి ఒక లక్ష ఐదు వేల రూపాయలు కు గణనాథుని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా భరత్ రెడ్డి చిట్టి రెడ్డి మాట్లాడుతూ గణనాథుని పెద్ద ప్రసాదం దక్కించినందుకు అదృష్టంగా భావిస్తున్నాను అని గత నాలుగు సంవత్సరాలుగా గణనాథుని నెలకొల్పి ఉత్సవాలను కాలనీవాసుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top