నిజాంపేట్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్

కుత్బుల్లాపూర్,ప్రజానేత్రం, సెప్టెంబర్ 30: నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఎమ్మెల్యే కె పి వివేకానంద్, మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కమీషనర్ రామకృష్ణ రావు లతో కలిసి పలు డివిజన్ల ప్రగతి యాత్ర లో భాగంగా కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో భాగంగా 16 చోట్ల 7కోట్ల 6 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నిధుల కొరత లేకుండా దశలవారీగా నిజాంపేట్ ని అభివృద్ధి పరుస్తున్నామని, బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని రాబోయే రోజుల్లో రాష్ట్రంలోనే నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ని ఒక ఆదర్శవంతమైన మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక డివిజన్ స్వతంత్ర్య కార్పొరేటర్లు శ్రీరాములు, వెంకట రామయ్య, వాణీ, పైడి మాధవి,సుజాత,లక్ష్మి కుమారి, బిఆర్ఎస్ కార్పొరేటర్ జి. శ్రీనివాస్ యాదవ్, ప్రజాప్రతినిధులు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ అధ్యక్షులు,ఆయా డివిజన్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీల సభ్యులు సీనియర్ నాయకులు, మహిళా నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, ఆయా విభాగాల అధికారులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, బస్తీ వాసులు, స్థానిక నివాసులు, ఇతర తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top