మేడిపల్లి, ప్రజానేత్రం, ఆగష్టు 23: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ పరిధిలోని ఎన్ఐఎన్ కాలనీ రోడ్ నెంబర్ 02 లో సుమారు 10 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి బుధవారం సిసి రోడ్డు నిర్మాణం పనులను పరిశీలించారు. నాణ్యతలో రాజీ పడకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కుమారును ఆదేశించారు.ఈ కార్యక్రమంలో 5వ డివిజన్ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ,పల్లె బాల్ రెడ్డి,బిక్షపతి,చంద్రశేఖర్,పవన్ తదితరులు పాల్గొన్నారు.