సంస్థాన్, ప్రజానేత్రం, సెప్టెంబర్ 20: మండల కేంద్రానికి చెందిన గంగాపురం శ్రీరాములు గౌడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ బుదవారం వారి పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగడ సానుభూతి తెలిపారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి , బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తెలంగాణ బిక్షం, బిఆర్ఎస్ నాయకులు శ్రీరాములు నరసింహ, పాశం కృష్ణ యాదవ్, గుండమల్ల సతీష్ , చిలువేరు బుగ్గ రాములు, చిలువేరు శంకర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.