మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్ అభివృద్ధికి ఇచ్చిన నిధులు శూన్యం: ప్రజల సొమ్ముతో బిఆర్ఎస్ సోకులు

  • తోటకూర వజ్రేష్ యాదవ్ విజయానికి కృషి చేయాలని ఏకగ్రీవ తీర్మానం

మేడిపల్లి, ప్రజానేత్రం, అక్టోబర్ 03: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికార పార్టీ బిఆర్ఎస్ పాలకవర్గం చేసిన అభివృద్ధి శూన్యమని, స్థానిక మంత్రి మల్లారెడ్డి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజాధనంతో మాత్రమే అభివృద్ధి పనులు చేస్తూ సొంత పార్టీ డబ్బా కొట్టుకుంటున్నారని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి మల్లారెడ్డి పై మండిపడ్డారు. బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మంత్రి మల్లారెడ్డి గెలిచిన నాలుగేళ్లలో ఎన్ని సొంత నిధులు విడుదల చేశాడు సమాచార హక్కు కింద కార్పొరేషన్ మున్సిపల్ అధికారులు ఇచ్చిన వివరాలను కరపత్రంగా విడుదల చేసి మంత్రి మల్లారెడ్డి తీరును ఎండగట్టారు.ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం నుండి బోడుప్పల్ కు ఎలాంటి నిధులు కేటాయించలేదని ప్రజల సొమ్ముతో శంకుస్థాపనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని,కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,డ్రైనేజీ,మంచినీటి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, సొమ్మొకరిది సోకొకరుది అన్న చందంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజల పన్నులతో ప్రారంభోత్సవాలు చేస్తూ మంత్రి మల్లారెడ్డి హడావుడి చేస్తున్నారని, ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు.అదేవిధంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. బోడుప్పల్ మున్సిపల్ భీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ వార్డ్ సభ్యులు బొమ్మ రమేష్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ దేవరకొండ వీరాచారి, తోటకూర అశోక్ యాదవ్,దూడల రాజు ముదిరాజ్,రాసాల కుమార్ యాదవ్,సుమారు 500మంది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొమ్మ రమేష్ మాట్లాడుతూ 28 సంవత్సరాల రాజకీయ జీవితంలో నిరంతరం ప్రజాసేవ కోసం పనిచేశానని భవిష్యత్తులో కూడా నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేస్తూ,స్థానిక నాయకుడు టిపిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర వద్వేష్ యాదవ్ నువ్వు భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top