ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే మోదీ రాష్ట్రానికి వరాలు కురిపిస్తుండు: గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి‌ సరితమ్మ…

  • బిఆర్ఎస్, బిజెపి మధ్య చీకటి ఒప్పందం…
  • తిరగబడదాం తరిమికోడదాం కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి‌ జెడ్పి చైర్మన్ సరితమ్మ…

గద్వాల, ప్రజానేత్రం, అక్టోబర్ 03: నియోజకవర్గం గద్వాల మండల పరిధిలోని సంగాల, జిల్లడబండ, మర్లపల్లి గ్రామాలలో తిరగబడదాం తరిమికోడదాం కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గద్వాల తాలూకా ఎమ్మెల్యే అభ్యర్థి జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ హాజరై కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.. వీరిని గ్రామంలోని పురవీధులలో తిరుగుతూ బిఆర్ఎస్ బిజెపి పార్టీలు చేసిన అన్యాయాలను, అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ.. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, పించను, ఉద్యోగ అవకాశాలు తదితర సంక్షేమాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చిల్చేందుకే ప్రధాని మోదీ పర్యాటన చేస్తున్నారని,బిఆర్ఎస్, బిజెపి ల మధ్య చీకటి ఒప్పందం ఉందని స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది, మోదీ రాకతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని,ఇన్నాళ్ళు మొద్దు నిద్రలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వచ్చి వరాలు కుర్పించడం వెనక మళ్లీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చూడటమే కావున తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ఈసారి తప్పకుండా మార్పు కోరుకుంటున్నారు..కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోని వస్తారన్నారు.ఈ సారి బహుజనులకు పెద్దపీట వేయాలని రేవంత్ రెడ్డి గారు అదేశం మేరకు గద్వాల నియోజకవర్గం నుంచి మీ ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి ఓటు వేసి బారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని సరితమ్మ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

Scroll to Top